జియో భారీ డీల్స్...

జియో భారీ డీల్స్...


భార‌త్‌లో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ వ్యాపారాల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది.. ఇక‌, జియోను ప్రారంభించి త‌న వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించారు ముఖేష్ అంబానీ.. ఆయ‌న ప‌ట్టింది ఏదైనా బంగారం అన్న‌ట్టుగా.. సంస్థ‌ను లాభాల బాట‌లో న‌డిపిస్తున్నారు.. అంతేకాదు.. అంత‌ర్జాతీయ సంస్థ‌ల నుంచి కూడా పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తూ... త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తున్నారు. ఇప్ప‌టికే.. ఫేస్‌బుక్ లాంటి సంస్థ‌ల‌కు కొంత వాటాను అమ్మి భారీగా ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంది.. తాజాగా మరో నాలుగు సంస్థలకు కూడా వాటాల‌ను అమ్మింది రిల‌య‌న్స్.. దీని ద్వారా రూ.30,062 కోట్లకు పైగా ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంది. 

జియో ప్లాట్‌ఫామ్స్‌లో 6.13 శాతం వాటాను ఎల్‌ కాట్టెర్టన్, ది పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, సిల్వర్ లేక్, జెనరల్ అట్లాంటిక్ కంపెనీలకు అమ్మిన‌ట్టుగా ప్ర‌క‌టించింది రిలయన్స్... ఎల్‌ కాట్టెర్ట‌న్ రూ.1894.50 కోట్లు చెల్లించి... జియోలో 0.39 శాతం వాటాను సొంతం చేసుకోగా.. ది పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ రూ.11,367 కోట్లు చెల్లించి... 2.32 వాటాను ద‌క్కించుకుంది. సిల్వర్ లేక్ యూనిట్స్ అయిన ఎస్ఎల్‌పీ రెడ్ వుడ్ హోల్డింగ్స్, ఎస్ఎల్‌పీ రెడ్ వుడ్ కో ఇన్వెస్ట్ (డీఈ)... 2.08 శాతం వాటాను పొంది... రూ.10,202.55 కోట్లు చెల్లించాయి. ఇక జనరల్ అట్లాంటిక్ సింగపూర్ జేపీ... రూ.6598.38 కోట్లకు... 1.34 శాతం వాటా దక్కించుకుంది. ఇప్పటివరకు 11 మంది గ్లోబల్ ఇన్వెస్టర్లు జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25.09% వాటాను రూ.18 1.18 లక్షల కోట్లకు కొనుగోలు చేశారు. ఈ పెట్టుబడులు, హక్కుల ఇష్యూ ద్వారా సేకరించిన, రూ.53,124 కోట్లతో పాటు, నికర రుణ రహిత సంస్థగా అవతరించే లక్ష్యాన్ని సాధించడానికి ఆర్‌ఐఎల్‌కు సహాయం చేస్తోంది. కాగా, ఇప్ప‌టికే ఫేస్‌బుక్‌కి చెందిన సబ్సిడరీ సంస్థ జాదూ హోలిండ్స్, ఎల్ఎల్‌సీతో డీల్ కుదుర్చుకొని... రూ.43,574 కోట్లు సంపాదించింది రిల‌య‌న్స్‌. జులై 7న జాదూ హోలిండ్స్‌తో కుదిరిన డీల్ వల్ల... ఆ సంస్థ... జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం ఈక్విటీ షేర్లను పొందిన సంగ‌తి తెలిసిందే.. ఇక‌, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్ట్ ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 8వ స్థానానికి ఎగ‌బాక‌డం మ‌రో విశేషం.