జియో బంపర్‌ ఆఫర్‌

 జియో బంపర్‌ ఆఫర్‌

రోజుకో ఆఫర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న రిలయన్స్‌ జియో తాజాగా  ఓ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలోనే తొలి జీరో కాస్ట్‌ పోస్ట్‌ పెయిడ్‌ సర్వీసులను ప్రవేశపెడుతూ రికార్డు నమోదు చేసింది. ఎలాంటి  నెలవారీ ఛార్జీలు, డిపాజిట్లు లేకుండానే  'జీరో టచ్‌' పేరుతో అంతర్జాతీయ కాలింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. నెలకు రూ.199 ప్యాక్‌లో 25 జీబీ డేటాని ఆఫర్‌ చేస్తోంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ సదుపాయాలను కల్పిస్తున్న ఈ ప్లాన్‌ ఈ నెల15 నుంచి అమల్లోకి వస్తోంది. ఈ ప్లాన్‌ కింద కాలింగ్ నిమిషానికి 50 పైసలు నుంచి మొదలవుతుందని జియో పేర్కొంది. ఇంటర్నేషల్‌ కాల్స్‌ విషయానికి వస్తే.. అమెరికా, కెనడాకు నిమిషానికి 50 పైసలు, చైనా, ఫ్రాన్స్‌, ఇటలీ, యుకె, సింగపూర్‌, బంగ్లాదేశ్‌కు నిమిషానికి రూ.2, ఆస్ర్టేలియా, బహ్రెయిన్‌కు నిమిషానికి రూ.4, కువైట్‌కు నిమిషానికి రూ.5, సౌదీ అరేబియా, యూఏఈకి నిమిషానికి రూ.6గా ఉన్నట్టు జియో తెలిపింది.