కరోనా : భారత ఆర్చర్ల పెళ్లి... హాజరైన సీఎం

కరోనా : భారత ఆర్చర్ల పెళ్లి... హాజరైన సీఎం

మన దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చిన తర్వాత రోజుకు దాదాపు 20,000 వేల కేసులు నమోదవుతున్నాయి దాంతో  దేశం మరోసారి లాక్ డౌన్ వైపు చూస్తుంది. ఇటువంటి సమయంలో భారత ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ వివాహం చేసుకున్నారు. ఎప్పటినుండో ప్రేమలో ఉన్న ఈ జంట రెండు సంవత్సరాల క్రితమే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కానీ ఈ ఏడాది జరగాల్సిన ఒలంపిక్స్ ముగిసిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఒలంపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో నిన్న మంగళవారం ఝార్ఖండ్‌ రాంచీలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హాజరుకావడం విశేషం. ఈ కరోనా సమయంలో భారత అథ్లెట్లు పెళ్లి చేసుకోవడంతో చాల మంది ఆశ్చర్య పోతున్నారు. అయితే ఈ పెళ్లికి వచ్చిన అతిధుల సంఖ్య కేవలం 100 మాత్రమే.