ప్రకాశ్ రాజ్ ఫాం హౌస్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలు..?

ప్రకాశ్ రాజ్ ఫాం హౌస్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలు..?

కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్-జేడీఎస్‌లు తమ క్యాంపును హైదరాబాద్‌కు మార్చాయి. ఇప్పటికే నాలుగు బస్సుల్లో నగరానికి చేరుకున్న ఎమ్మెల్యేల్లో కొందరిని తాజ్‌కృష్ణ, నోవాటెల్‌లకు తరలించారు. కాగా జేడీఎస్ ఎమ్మెల్యేలకు ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్‌ ఆశ్రయం కల్పించారు. హైదరాబాద్‌లోని తన ఫాం హౌస్‌లో 35 మందికి బస ఏర్పాటు చేశారు. దేవెగౌడ సూచన మేరకు జేడీఎస్ ఎమ్మెల్యేలకు ప్రకాశ్ రాజ్ సాయం చేసినట్లుగా తెలుస్తుంది.