హంగ్‌ ఖాయం...కింగ్‌ మేకర్‌ దేవెగౌడ

హంగ్‌ ఖాయం...కింగ్‌ మేకర్‌ దేవెగౌడ

ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ చూస్తే కర్నాటకలో హంగ్‌ ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలకు, ఎగ్జిట్‌ పోల్స్‌కు పెద్దగా వ్యత్యాసం లేదు. రాజకీయ యాజమన్యాలున్న మీడియా సంస్థలను పక్కన బెడితే... కర్ణాటకలో హంగ్‌ తప్పదని తెలుస్తోంది. ఏ ఒక్క ఎగ్జిట్‌ పోల్ లోనూ స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. చాణక్యతో పాటు కొన్ని బీజేపీ సంబంధిత ఛానల్స్‌ మాత్రం బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. ఇండియా టుడే, టైమ్స్‌ నౌ ఛానల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలతో టాప్‌లో నిలబడటం ఖాయం. కాని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి.

బీజేపీ, జనతాదళ్‌ (ఎస్‌) మధ్య రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్‌ అంటోంది. ఒకవేళ జనతాదళ్‌ (ఎస్‌)కు అధిక సీట్లు వచ్చే పక్షంలో.. దేవెగౌడ కీలక పాత్ర పోషించే అవకాశముంది. మునుపటిలాగా అధికార పీఠం పంచుకునేలా కొత్త ఫార్ములా తెస్తారా లేదా కాంగ్రెస్‌తో జతకలుస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ బీజేపీకి గనుక తక్కువ సీట్లు వచ్చే పక్షంలో సీఎం అభ్యర్థి జనతాదళ్‌ (ఎస్‌) నుండే ఉండొచ్చు.  మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం తామే అధికారంలో వస్తామతో ఉంది. అవసరమైతే జనతాదళ్‌ (ఎస్‌)లోని తన మిత్రులకు సిద్ధరామయ్య రెడ్‌ కార్పెట్ వేస్తారని టాక్‌ ఇపుడు కన్నడ రాజకీయాల్లో వినిపిస్తోంది.