ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న జపాన్ సమ్మె 

ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న జపాన్ సమ్మె 

మన దేశంలో సమ్మెలంటే వెంటనే గుర్తొచ్చేది ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, సమాజానికి హాని కలిగించేలా హింసా పద్దతిని అవలంభించడం. కానీ జపాన్ లో జరుగుతున్న డ్రైవర్ల సమ్మె గురించి తెలిస్తే.. ముక్కున వెలుసుకోక తప్పదండోయ్. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదామా. జపాన్ లోని ఒకేయం ప్రాంతంలో రీఓబి సంస్థ బస్సులను నడుపుతూ ఉంటుంది. వీరికి పోటీగా రివల్ కంపెనీ అదే ప్రాంతంలో వీరికంటే తక్కువ ధరకు బస్సులను నడపడం ప్రారంభించింది. 

సో దీని వల్ల తమకు ఉద్యోగ భద్రత కావాలని రీఓబి సంస్థ బస్సు డ్రైవర్లు..ఓ అడుగు ముందుకేసి ఫ్రీగా బస్సులను నడపడం ప్రారంభించారు. దీనివల్ల వారి యాజమాన్యానికి..ఉద్యోగుల విలువ తెలియడమే కాకుండా..ప్రజల్లో కూడా ఫ్రీ రైడ్ బస్ పై మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడి సోషల్ మీడియా కూడా దీని వల్ల సాధారణ ప్రజానీకానికి ఇంకా ఎక్కువ దగ్గర అయ్యారని చెప్తోంది. మరి చివరికి ఈ సమ్మె ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా..వారి నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా తమ విధులను నిర్వర్తిస్తుండడం మూలాన ప్రపంచం మొత్తం ఈ డ్రైవర్ల సమ్మెవైపే చూస్తోంది.