పాప ఏడుస్తోంది... ఏడవనివ్వండి

పాప ఏడుస్తోంది... ఏడవనివ్వండి

సాధారణంగా పిల్లలు ఏడిస్తే కోపం వస్తుంది. ఆ ఏడుపు ఎప్పుడు ఆపుతార్రా దేవుడా అని అనుకుంటాం. తల్లిదండ్రులు సైతం తీవ్ర అసహనానికి గురువుతారు. ఏడుపు మాన్పించేందుకు పడరాని పాట్లు పడుతారు. కొందరు పిల్లలు ఎంత సముధాయించినా ఏడుపు మానరు సరికదా ఇంక ఎక్కువ ఏడ్వటం చేస్తారు. ఇరుగుపొరుగు సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. కానీ  జపాన్ గవర్నర్ల బృందం వెలుబుచ్చిన అభిప్రాయం ప్రజల్ని ఆలోచింపజేస్తోంది. 

పిల్లల్ని ఏడ్వనీయండి... వారు ఏడుస్తుంటే... అసహనం ప్రదర్శించకండి. ఈ అభిప్రాయం సాధారణ వ్యక్తులది కాదు. 13 మంది జపాన్ గవర్నర్ల బృందానిది.  పిల్లల సంరక్షణపై ఏర్పాటు చేసిన సమావేశంలో వెలిబుచ్చిన అభిప్రాయం. ఏడుస్తున్న చిన్నారులపై తల్లిదండ్రులు సహనం ప్రదర్శించాలన్నారు. తల్లిదండ్రులు సామాజిక స్థితిని మార్చుకోవాలన్నారు. ఇరుగు పొరుగు పరిస్థితులు సైతం అసహనానికి కారణమంటున్నారు పేరెంట్స్ . ఏడుస్తున్న పిల్లలపై ఇరుగు పొరుగు అసహనం ప్రదర్శిస్తే... పేరెంట్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. పిల్లల సంరక్షణపై ఇప్పటికే జపాన్ లో భారీగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వేస్తున్నారు. చిన్నారుల  పెంపకంపై కుటుంబాలకు మరింత అనుకూలమైన సమాజాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జపాన్ లో ఇప్పటికే జననాల రేటు తగ్గిపోతోందని గవర్నల బృందం ఆవేదన వ్యక్తం చేసింది.