జాన్వీ కపూర్ ధఢక్ ట్రైలర్ కథ

జాన్వీ కపూర్ ధఢక్ ట్రైలర్ కథ

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ తెరంగ్రేటం చేసిన ధఢక్ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది.  ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా ఇషాన్ హీరో.  శశాంక్ కైతన్ అందమైన ప్రేమకథలా ఈ సినిమాను తీర్చిదిద్దారు.  స్వాతంత్య్రాన్ని కోరుకునే ఇద్దరు యువతీయువకులు ప్రేమలో పడతారు. ఇద్దరు ప్రేమలో పడ్డాక వారి జీవితం మారిపోతుంది.  కుటుంబాల్లో కలతలు మొదలౌతాయి.  వీరి ప్రేమను రెండు కుటుంబాలవారు ఒప్పుకోరు.  ఆ తరువాత ఏం జరిగింది అన్నది మూలకథ.  శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తన తన నటనతో ఆకట్టుకుంది.  కొన్ని సన్నివేశాల్లో అచ్చు శ్రీదేవిని తలపించేలా ఉంది.  మొత్తానికి జాన్వీ తెరంగ్రేటం అద్భుతంగా ఉందనే చెప్పొచ్చు.