క్రికెట్ లో కొత్త తరహా సంబరాలు...

క్రికెట్ లో కొత్త తరహా సంబరాలు...

జూలై 8 నుండి సౌతాంప్టన్‌లో జరిగే 3 టెస్టుల సిరీస్‌ ఇంగ్లాండ్ వెస్టిండీస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నందున, కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన విరామం తరువాత అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభమవుతుంది. అందువల్ల మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టు టీమ్ బట్లర్ మరియు టీమ్ స్టోక్స్ గా విడిపోయి సాధన ప్రారంభించాయి. ఈ మ్యాచ్ యొక్క మొదటి రోజు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండ‌ర్స‌న్ బంతిని రెండు విపుల స్వింగ్ చేస్తూ , 2 వికెట్లు పడగొట్టడంతో పాటు ఓవర్ కు 3 పరుగుల కన్నా తక్కువ ఇచ్చాడు. అయితే కరోనా నేపథ్యంలో అతను వికెట్లు తీసుకున్నపుడు సంబరాలు చర్చకు దారితీసాయి. అప్పుడు కౌగిలింతలు లేదా హై-ఫైవ్‌లు లేవు. అక్కడ వారు అందరూ తమ మోచేయిని చూపిస్తూ సహచరులను తాకకుండా సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓవర్ల మధ్య హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించారు ఆటగాళ్లు.