ఇరిగేషన్ ప్రాజెక్టులు కాదు... కరప్షన్ ప్రాజెక్టులు 

ఇరిగేషన్ ప్రాజెక్టులు కాదు... కరప్షన్ ప్రాజెక్టులు 

రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ఓటు వేస్తే పరోక్షంగా నరేంద్రమోదీకు వేసినట్టే అన్నారు. తెలంగాణ సీఎంకు నాలుగేళ్ళ పాలనలో గుర్తుకు రాని రైతులు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చారు అని ప్రశ్నించారు. నాలుగేండ్లుగా రుణమాఫీ ఊసే లేదని విమర్శించారు. సెక్రటేరియట్ వెళ్లని సీఎంను నా రాజకీయ జీవితంలో కేసీఆర్ నే చూస్తున్నానని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో కడుతున్న ప్రాజెక్టులన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావనీ కరప్షన్ ప్రాజెక్టులని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణపేటను జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు జైపాల్ రెడ్డి.