లూసిఫర్ రీమేక్ లో జగపతి బాబు ..?

లూసిఫర్ రీమేక్ లో జగపతి బాబు ..?

ర‌న్ రాజా ర‌న్ చిత్రంతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న సుజీత్ .. ఇటీవ‌ల ప్ర‌భాస్ హీరోగా సాహో అనే చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించాడు. ఈ చిత్రం తెలుగులో అంత‌గా ఆద‌ర‌ణ పొంద‌క‌పోయిన హిందీలో మాత్రం మంచి విజ‌యం సాధించింది. ఇదిలా ఉంటే  ఈ డైరెక్ట‌ర్‌కి మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కింది. లూసిఫ‌ర్ రీమేక్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవిని సుజీత్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. మ‌ల‌యాళంలో సూపర్ హిట్టైన లూసిఫ‌ర్ రీమేక్ రైట్స్ రామ్ చ‌ర‌ణ్ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నుండ‌గా, లాక్ డౌన్ స‌మ‌యంలో ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేశాడ‌ట సుజీత్. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు ఇందులో మార్పులు చేసాడ‌ని తెలుస్తుంది. ఏడాది చివ‌ర‌లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు సమాచారం.  తాజా గా ఈ సినిమా లోని కీలక పాత్ర ను జగపతి బాబు తో చేయించేందుకు సుజీత్ చర్చలు జరుపుతున్నాడట. ఈమద్య కాలం లో స్టార్ హీరోల చిత్రాల్లో జగపతి బాబు కీలక పాత్రల్లో కనిస్తున్నాడు. అందుకే ఆయన్ను ఈ చిత్రం లో నటింపజేయడం వల్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారట చిత్రయూనిట్