టీవీ హోస్ట్ గా మారనున్న టాలీవుడ్ విలన్

టీవీ హోస్ట్ గా మారనున్న టాలీవుడ్ విలన్

హీరోలు ఇప్పడు టీవీ హోస్ట్ లుగా అవతారమెత్తుతున్న విషయం తెలిసిందే. అటు వెండి తెరమీద ఇటు బుల్లితెరమీద రాణిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. తాజాగా టాలీవుడు విలన్ కూడా హోస్ట్ గా మారనున్నారు. హీరోగా తనను తాను నిరూపించుకొని ఆ తర్వాత విలన్ గా మరి ప్రేక్షకులను భయపెట్టారు జగపతి బాబు. ఇదివరకే చిరంజీవి నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ నాని రానా సాయికుమార్ అలీ లాంటి సెలబ్రిటీలు టీవీ తెరపై సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా జగపతిబాబు కూడా బుల్లితెరపై మెప్పించడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆయన హోస్ట్ గా రియాలిటీ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందో అని బుల్లితెర ప్రేక్షకులలో కొంత ఆసక్తి నెలకొంది.