అక్కడ టికెట్లు వారికే!

అక్కడ టికెట్లు వారికే!

గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లే... మళ్లీ చేయకుండా ఈసారి పక్కా ప్లాన్ తో వెళుతున్నారు వైసీపీ అధినేత జగన్.  వాస్తవ పరిస్థితులు అంచనా వేస్తు ముందుకు సాగుతున్నారు. సీట్ల పంపకంలో కూడా సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. 
గతంలో ఓటమితో  గుణపాఠాలు నేర్చుకున్నారు. నాలుగేళ్లులో తగిలిన ఎదురుదెబ్బలతో మెలుకువలు నేర్చుకున్నారు. పరిణిత చెందిన నేతగా అడుగులు వేస్తున్నారు. పక్కా ప్రణాళికతో పావులు కదుపు తున్నారు. ఇందులో భాగంగానే ఏపీలో టీడీపీ బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేశారు. ముఖ్యంగా రాజధాని పరిసర జిల్లాల్లో సీట్లు పెంచుకోవడానికి జగన్.... ప్లాన్ వేశారు. అధికార టీడీపీకి రాజధాని పరిసర జిల్లాల్లోని కమ్మ సామాజిక వర్గం బలం మైన ఓటు బ్యాంకు. 

కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకును కైవసం చేసుకునేందుకు.... ఈసారి ఎక్కువ సీట్లు వారికే ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీలో అసంతృప్త నాయకులపై వల విసరనున్నారని తెలుస్తోంది. ఈ విధంగా చేస్తే... టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు కూడా వైసీపీ గట్టి కౌంటర్ ఇచ్చినట్లవుతుంది. అందుకు ధీటుగా ఫ్యాన్ పార్టీ  పావులు కదువుతోంది. దీంతో చంద్రబాబును సెల్ప్ డిఫెన్స్ పడేయాలని జగన్ ప్లాన్.   కమ్మ సామాజిక నేతలను ఆకర్షించే బాధ్యతలను రాజధాని చుట్టుపక్కాల జిల్లాల్లోని అత్యంత నమ్మకస్తులైన లీడర్లకు అప్పగించారు. 

ఎట్టి పరిస్థితుల్లోను టార్గెట్ రీచ్ కావాలని ఆదేశించారు.  అధినేత ఆదేశాల ప్రకారం రంగంలోకి దిగిన వైసీపీ నేతలు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఎక్కువగా ఎమ్మెల్యేలు కమ్మసామాజిక వర్గానికి చెందిన వారే. దాదాపు 30పైగా స్థానాలు ఉన్న కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం ఓటు శాతం ఎక్కువ. దీంతో గన్నవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ, పెనమలూరు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో కమ్మ వర్గానికి భారీగా సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

ఇప్పటికే కృష్ణా జిల్లాలో కొందరు వైసీపీలో చేరారు. విజయవాడ పటమటకు చెందిన ఎంవీఆర్ ఆర్ చౌదరి ఫ్యాన్ కిందకు వచ్చారు. ఆయనకు జిల్లాలో పెద్ద బంధుత్వం ఉంది. యూత్ లో ఆయనుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఒకప్పుడు ఎంవీఆర్ ఆర్... నెహ్రూ అనుచరుడు. ఇప్పుడు వైసీపీ జెండాలను ఎగుర వేస్తున్నారు.  చౌదరీ వైసీపీ తీర్థం పుచ్చుకోవటంతో కమ్మ నాయకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అర్థ, అంగ బలం దండిగా ఉన్న మరో నేత యార్గ గడ్డ వెంకట్రావ్ కూడా వైసీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడాయన గన్నవరం ఇంచార్జ్. వల్లభనేని వంశీతో ఢీ కొట్టేందుకు రెడీగా ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ తీర్థం పుచ్చుకోవటం కూడా ఖాయమైంది. విజయవాడ తూర్పు , పెనమనూరులో ఆయనకు పెద్ద నెట్ వర్క్ ఉండటంతో టీడీపీ కంచు కోటలో సత్తా చాటవచ్చని వైసీపీ భావిస్తోంది. 

విజయవాడలో ఓ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువైన ఓ నాయకునితో వైసీపీ వర్గాలు మంతనాలు జరిపారు. ఆయన గతంలో మేయర్ పదవి ఆశించి దక్కక పోవటంతో ఆలకబూనారు. వైసీపీలో చేరి తన సత్తా చూపిస్తానంటున్నారు. సీటీకి చెందిన ఓ పారిశ్రామిక వేత్త కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోనే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు.... ఎంపీ స్థానాలను కూడా కమ్మ వర్గానికే ఎక్కువ కేటాయించే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ భావిస్తోంది. కాపు సామాజిక ప్రాభల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదే తరహా విధానం అవలంభించే అవకాశముంది. ప్రశాంత్ కిషోర్ జగన్ కి ఇదే తరహా సూచనలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా టీడీపీలో ఉన్న అసంతృప్త నేతలపైనే ఎక్కువగా గురి పెట్టింది వైసీపీ. ఏది ఏమైనా.... ఈసారి రాజధాని చుట్టు పక్కల జిల్లాల్లో 15మంది దాకా కమ్మ సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వాలనేది జగన్ ప్లాన్.