గోదావరికి జగన్‌ పూజలు

గోదావరికి జగన్‌ పూజలు

వైసీపీ అధినేత జగన్‌ ఇవాళ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు.  ప్రజాసంకల్ప యాత్ర  187వ రోజులో భాగంగా ఈరోజు ఉదయం విజయ​విహార్‌ కొవ్వూరు బైపాస్‌ సర్కిల్‌ నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. కొవ్వూరులోని ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గోస్పాద క్షేత్రం చేరుకున్నారు.  వేద పండితుల ఆధ్వర్యంలో ఆయన గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరమ్మకు హారతినిచ్చారు.