గుడ్ న్యూస్... 50 వేల మందికి ఒకేసారి నియామక పత్రాలు

గుడ్ న్యూస్... 50 వేల మందికి ఒకేసారి నియామక పత్రాలు


ఏపీలో ఔట్ సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ఆయన.. సుమారు యాభై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఉద్యోగం రావడానికి లంచాలు.. జీతం ఇవ్వడానికి లంచాలు అనే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

పాదయాత్రలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నానని,ఆప్కోస్ ద్వారా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని తెలిపారు సీఎం జగన్. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో 50శాతం ఎస్సీ,ఎస్టీ, బీసీలున్నారని, ఎలాంటి అవినీతి, లంచాలు లేకుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు అందజేస్తామని తెలిపారు. 

ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను మార్చాలని, ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు కేటాయింపులుంటాయని, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ ఉండ కూడదని తెలిపారు సీఎం. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారని, గతంలో భాస్కర్‌నాయుడు అనే వ్యక్తికి అన్నిచోట్ల కాంట్రాక్ట్‌లు ఇచ్చారని జగన్ అన్నారు. ఈ భాస్కర్ నాయుడు చంద్రబాబు మనిషని జగన్ అన్నారు.