'జగన్‌, పవన్‌ ఒకే వేదికపైకి రావాలి'

'జగన్‌, పవన్‌ ఒకే వేదికపైకి రావాలి'

టీడీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి జగన్‌, పవన్‌కల్యాణ్‌సహా అన్ని పార్టీల నేతలూ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈమేరకు ఇవాళ ఆయన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఎందరో త్యాగాలు ఫలితంగా దేశంలో విదేశీ పాలన పోయిందని.. కానీ ఏపీని  సింగపూర్ పాలిత ప్రాంతంగా చేయడానికి చంద్రబాబునాయుడు తహతహలాడుతున్నారని విమర్శించారు. అమరావతి భూములను సింగపూర్ కంపెనీలకు ఇస్తామని ప్రకటించిన జూన్ 7 ఏపీకి చీకటి రోజని ఆ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు పాలనా విధానాలపై యుద్ధభూమిలో తేల్చుకోవడానికి వైసీపీ అధినేత జగన్‌, జనసేన అధినేత పవన్‌లు ప్రణాళిక రూపొందించాలని ముద్రగడ అభిప్రాయపడ్డారు. వారిద్దరూ యాత్రలకు కొంత విరామ ప్రకటించి ఈ దిశగా ఆలోచించాలని కోరారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టులను కలుపుకుని చంద్రబాబుపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.