తిరుమల పరిణామాలపై సీఎంకు బహిరంగలేఖ

తిరుమల పరిణామాలపై సీఎంకు బహిరంగలేఖ

తిరుమలలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరో బహిరంగలేఖరాశారు. రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై విచారణ అవసరమని లేఖలో పేర్కొన్న ఐవైఆర్... ప్రధాన అర్చుకుడి నుంచి ఆరోపణలు వచ్చినందున తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోటు ప్రాంతంలో తవ్వకాలు జరిపే అధికారం ఎవ్వరికీ లేదని రాసుకొచ్చారు ఐవైఆర్ కృష్ణారావు. ప్రతీ వ్యవస్థలో, ప్రభుత్వంలోనూ లోపాలను తెలియపరిచే వ్యక్తులకు భద్రత కల్పించే విధివిధానాలు ఉంటాయని... అటువంటివారికి పూర్తి రోణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని పేర్కొన్నారాయన. పరిపాలనలో సంస్కరణలను స్వాగతించే తమరు ఈ విధంగా వ్యవస్థలో జరుగుతున్న లోపాలను తెలియపర్చడాన్ని ఆహ్వానిస్తారని అనుకుంటున్నానని... ఈ నేపథ్యంలో మరోసారి ఈ అంశాన్ని పునరాలోచిస్తే బాగుంటుందని పేర్కొన్నారు ఐవైఆర్ కృష్ణారావు. కాగా, గత కొన్నిరోజులుగా టీటీడీ, రమణదీక్షితులు మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.