7 రోజులు 1200 కిలోమీటర్ల ప్రయాణం.. ఆమె ప్రేమకు ఇంవాక ట్రంఫ్ ఫిదా

7 రోజులు 1200 కిలోమీటర్ల ప్రయాణం.. ఆమె ప్రేమకు ఇంవాక ట్రంఫ్ ఫిదా

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో వలస కూలీల కష్టాలు తారాస్థాయికి చేరాయి.. నెత్తిలో మూట, సంకలో బిడ్డ, ఇంకో చేతిలో మరో లగేజీ పట్టుకుని.. తమ సొంత ప్రాంతాలకు చేరడానికి కాలినడకన సాగినవారి కష్టాలు మాటల్లో వర్ణించలేం... చిన్నారులు అమ్మా ఇంకా ఎంత దూరం.. నాన్నా ఇంకా మన ఊరు ఎప్పుడొస్తుంది అని ప్రశ్నిస్తుంటే.. పంటికొంద దుఖాన్ని అదిమిపట్టుకుంటు.. నడకసాగించారు లక్షలాది మంది.. ఇదే సమయంలో.. అనారోగ్యంతో బాధపడుతోన్న తన తండ్రిని 15 సంవత్సరాల బాలిక జ్యోతి కుమారి.. సైకిల్‌పై ఏకంగా 1,200 కిలోమీటర్లు తీసుకెళ్లింది.. లాక్‌డౌన్‌తో సర్వం బంద్ కావడంతో.. ఊరికి వెళ్లడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఓ పాత సైకిల్‌ను కొనుగోలు చేసి.. దానిపై తన తండ్రిని కూర్చోబెట్టుకుని.. ఏడు రోజుల పాటు ప్రయాణం చేసి 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఊరికి చేర్చింది.. ఆ బాలిక యొక్క ప‌ట్టుద‌ల‌ను చూసి.. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రశంసకు కురిపించింది.. ఇక, ఈ ఘటనను చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా ఫిదా అయిపోయింది.. సోషల్ మీడియా వేదికగా జ్యోతిని ప్రశంసించిన ఇవాంకా.. ఆమె అస‌మాన‌ ప్రతిభను మెచ్చుకుంది.. ‘గాయంతో ఉన్న తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని 7 రోజుల పాటు తొక్కుతూ 1200 కిలోమీట‌ర్ల దూరం ప్రయాణించి సొంత ఊరికి చేరుకుంది.. ఆమె అందమైన స‌హ‌నం, ప్రేమ… భారతీయ సొసైటీనే కాకుండా సైక్లింగ్ ఫెడరేషన్‌ను కూడా ఆకట్టుకుంది.’ అంటూ ట్వీట్ చేశారు ఇవాంకా ట్రంప్.