ముదురుతున్న ఇటలీ సంక్షోభం

ముదురుతున్న ఇటలీ సంక్షోభం

ఇటలీలో సంక్షోభం కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు విఫలమైంది. ఇటలీలో ప్రధాని పదవికి ప్రతిపాదించిన గ్యూసెప్ కాంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకున్నారు. తాను ఆర్థిక మంత్రిగా ప్రతిపాదించిన వ్యక్తిని దేశ అధ్యక్షుడు వీటో చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను అన్ని ప్రతిపాదనలను అంగీకరించడానికి సిద్ధమే కానీ పావ్లో సావోనాను మాత్రం అంగీకరించలేనని ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటరెల్లా చెప్పారు. దీంతో గ్యూసెప్ కాంటే, అధ్యక్షులు సెర్గియో మధ్య వార్ మొదలైంది.  పావ్లోకు యూరోపియన్ యూనియన్ అధికారాలను విమర్శిస్తాడనే పేరుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న పాప్యులిస్టు పార్టీలకు అధ్యక్షుడి నిర్ణయం ఆగ్రహం తెప్పించింది. 5-స్టార్ పార్టీ నేత లూయిగీ డి మాయివో అధ్యక్షుడి అభిశంసనకు సైతం పిలుపునిచ్చారు.
ఇటలీలో మార్చి 4న ఎన్నికలు జరిగినప్పటికీ ఇంకా ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. రెండు పాప్యులిస్టు పార్టీలు, 5-స్టార్ పార్టీకి కలిపి 32 శాతం ఓట్లు లభించాయి. కాగా, 18 శాతం ఓట్లు లభించిన మితవాద లీగ్ పార్టీ ఈ నెల ఆరంభంలో జరిగిన చర్చల తర్వాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.