రమణదీక్షితులది రాజకీయ దీక్ష

రమణదీక్షితులది రాజకీయ దీక్ష

రమణ దీక్షితులు బాద్యతరహితంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి  ఆరోపించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. రమణ దీక్షితులు అర్చక వృత్తి మరిచి రాజకీయ దీక్ష తీసుకున్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ఆయన మాట్లాడటాన్ని తాము  తీవ్రంగా పరిగణిస్తున్నామని కేఈ అన్నారు. ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు ఎన్నో తప్పులు చేశారని, సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారని కేఈ ఆరోపించారు. పక్క రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి ఎలా ఆరోపణల చేస్తారని ప్రశ్నించారు.   స్వామి వారి గురించి చేడుగా మాట్లాడితే అప్పుడే వారి పతనం ప్రారంభం అవుతుందని, ఏడుకొండలు గురించి గతంలో చెడుగా మాట్లాడిన రాజకీయ నాయకులకు గతంలో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందేనని మంత్రి చెప్పారు. రమణ దీక్షితులు గతంలో చేసిన తప్పులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటూ... స్వామివారి నగలపై చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ... ఏటా అధికారుల వెరిఫికేషన్ జరుగుతున్న విషయాన్ని ఆయన గర్తు చేశారు.