ఇస్మార్ట్ హంగామా మళ్ళీ మొదలైంది... థియేటర్లలో కాదు...  

ఇస్మార్ట్ హంగామా మళ్ళీ మొదలైంది... థియేటర్లలో కాదు...  

గతేడాది రిలీజైన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.  ఈ సినిమాపై పూరి, రామ్ లు పెట్టుకున్న నమ్మకం నిజమైంది.  పెట్టిన పెట్టుబడికి మూడు రేట్ల ఆదాయం వచ్చింది.  భారీ లాభాలు రావడంతో పూరి ఖుషి అయ్యారు. ఊరమాస్ సినిమాగా ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసుకుంది.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా టీవీలో కూడా టిఆర్పి రేటింగ్ భారీ స్థాయిలో తెచ్చుకుంది.  

ఎన్టీఆర్ టెంపర్ తరువాత ఇస్మార్ట్ కు ఆ రేంజ్ లో విజయం దక్కింది.  ఇదిలా ఉంటె, ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.  24 గంటల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ సినిమాకు ఏకంగా 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి.  తెలుగులో తెరపై సందడి చేసిన ఇస్మార్ట్ శంకర్, హిందీలో యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది.