కాశి.. ఆ రేంజ్ లో హిట్ అవుతుందా..?

కాశి.. ఆ రేంజ్ లో హిట్ అవుతుందా..?
విజయ్ ఆంటోని హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా తెలుగులో ఎలాంటి హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ హిట్ అయింది.  కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేకతను చాటుకుంది.  ఈ సినిమా ఇచ్చిన కిక్ తో తెలుగులో మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు విజయ్.  బిచ్చగాడు హిట్ అవ్వడంతో.. తరువాత భేతాళుడు, ఇంద్రసేనా సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. కానీ అవి ఆశించినంతగా విజయం సాధించలేకపోయాయి.  మరలా ఇప్పుడు విజయ్ కాశి పేరుతో ఓ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  ఈనెల 18 వ తేదీన కాశి విడుదల కాబోతున్నది.  
 
కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫాతిమా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో విజయ్ ఆంటోని నిమిస్తున్నారు.  విజయ్ నిర్మించడమే కాకుండా.. సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాలో విజయ్ సరసన అంజలి, సునయనలు కథానాయికలుగా నటిస్తున్నారు.  
తమిళంలో ఫాతిమా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రవతి లు తెలుగులో విడుదల చేస్తున్నారు.  ఈ కాశి సినిమాకు మొదటి నుంచి మంచి పోటీ ఉన్నది.  ఈ పోటీని తట్టుకొని తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్నారు.  ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలైన మొదటి 7 నిమిషాల చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.  మరి బిచ్చగాడు లాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందా..? చూద్దాం.