వోడ్కాతో కరోనా రిస్క్ తగ్గుతుందా? 

వోడ్కాతో కరోనా రిస్క్ తగ్గుతుందా? 

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికి తెలిసిందే.  బాటిల్ పై ఈ విషయం స్పష్టంగా రాసుంటుంది.  అయినప్పటికీ మద్యం తాగకుండా ఉంటున్నారా చెప్పండి.  చాలా దేశాల్లో మద్యం అమ్మకాల ద్వారానే అధికంగా ఆదాయం వస్తుంటుంది.  ఇక ఇదిలా ఉంటె, కొన్ని రకాల ఆరోగ్యసంబంధమైన విషయాల కోసం ఆల్కహాల్ ను వినియోగిస్తుంటారు.  కరోనా కాలంలో వైరస్ ను  కట్టడి చేసేందుకు కావాల్సిన శానిటైజర్స్ ను ఆల్కహాల్ తో తయారు చేస్తుంటారు.  

అయితే, గత కొన్ని రోజులుగా ఓ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  అదేమంటే, వోడ్కా తాగితే కరోనా దరిచేరదని, శరీరంలో ఉండే కరోనాను వోడ్కా చంపేస్తుందని వార్త ట్రెండ్ అవుతున్నది.  అమెరికాకు చెందిన సెయింట్ ల్యూక్స్ ఆసుపత్రి వర్గాలు ఈ విషయాన్ని తెలియజేసినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో, సెయింట్ ల్యూక్స్ ఆసుపత్రి వర్గాలు స్పందించాయి.  తాము ఈ విషయాలు చెప్పలేదని,  మద్యం సేవిస్తే కరోనా రిస్క్ తగ్గుతుందని చెప్పి తాము  ఎలాంటి లేఖ విడుదల చేయలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.  మద్యం సేవించడం వలన శ్వాసకోశ సమస్యలు వస్తాయని, ఊపిరి తిత్తుల్లో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోతుందని  సెయింట్ ల్యూక్స్ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.