కెమికల్ గ్యాసులు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ప్రమాదమా ?

కెమికల్ గ్యాసులు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ప్రమాదమా ?

కెమికల్ గ్యాస్ లతో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఈ విషయం అందరికి తెలిసి.  మాములు ఇంట్లో వంట కోసం వినియోగించే గ్యాస్ లీకైతే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అందరం చూస్తూనే ఉన్నాం.  అలాంటిది పాలిథిన్ కవర్లు తయారు చేయడానికి వినియోగించే కెమికల్ గ్యాసులు ఇంకెంత ప్రమాదకరంగా ఉంటాయో చెప్పలేని పరిస్థితి.  

కెమికల్ గ్యాసులు ఎక్కువ కాలం నిల్వ ఉంచితే ఆ గ్యాస్ లో సెకండరీ రియాక్షన్ స్టార్ట్ అవుతుందని, అది ప్రమాదకరంగా మారి నిల్వ ఉంచిన ట్యాంకర్లు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.  ఇప్పుడు స్టిరిన్ గ్యాస్ విషయంలోనూ అదే జరిగింది.  ఈ స్టిరిన్ గ్యాస్ ను నిల్వ ఉంచిన ట్యాంకర్లలోని గ్యాస్ లో సెకండరీ రియాక్షన్ స్టార్ట్ అయ్యింది.  ఆ తరువాత అది ట్యాంకర్ల నుంచి లీక్ అవుతూ వచ్చింది. ఈ లీక్ ఒక్కసారిగా ఎక్కువ కావడంతో ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సమీపంలో ఉన్న గ్రామాలపై ఎక్కువ ప్రభావం చూపించింది.  ఎక్కువ రోజులు కెమికల్ నిల్వ ఉంటె రియాక్షన్ జరుగుతుందని కంపెనీ సిబ్బందికి తెలిసినప్పటికీ కూడా ముందుగా స్పందించి దానిపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.