నెట్‌ఫ్లిక్స్‌తో పోటీకి యాపిల్‌ రెడీ

నెట్‌ఫ్లిక్స్‌తో పోటీకి యాపిల్‌ రెడీ

వీడియో స్ర్టీమింగ్‌లో రారాజు నెట్‌ ఫ్లిక్స్‌. అమెజాన్‌ వీడియో, హులు వంటి వీడియో స్ర్టీమింగ్‌ కంపెనీలకు పోటీగా యాపిల్‌ ఈ రంగంలోకి అడుగు పెడుతోంది. దాదాపు వంద కోట్ల డాలర్ల పెట్టుబడితో రంగం సిద్ధం చేస్తోంది. తరవాత ఏడాదికి నాలుగు వందల కోట్ల డాలర్ల పెట్టుబడికి ప్రణాళికలు సిద్ధం చేసిన యాపిల్‌ వచ్చే ఏడాది మార్చిలో స్ర్టీమింగ్‌ సర్వీస్‌ను ప్రారంభించే అకాశముందని వార్తలు వస్తున్నాయి. యాపిల్‌ రాకతో నెట్‌ఫ్లిక్స్‌ కూడా తన పెట్టుబడులను పెంచనుంది. ఏడాదికి కనీసం 800 కోట్ల డాలర్లను ఈ వ్యాపారంలో పెట్టాలని భావిస్తోంది. బోల్డంత నగదు గుట్టలపై కూర్చున్న యాపిల్‌ కొత్త వ్యాపారంలోకి దూకడానికి  సిద్ధంగా ఉంది. యాపిల్‌ మ్యూజిక్‌ జయాపజయాలతో నిమిత్తం లేకుండా వీడియో స్ర్టీమింగ్‌లో యాపిల్‌ వచ్చేస్తోంది.