అబార్షన్‌పై నిషేధం ఎత్తివేతకే ఓటు

అబార్షన్‌పై నిషేధం ఎత్తివేతకే ఓటు

ఐర్లాండ్ ప్రజలు అబార్షన్ నిషేధం చట్ట సవరణకు అనుకూలంగా తీర్పునిచ్చారు. అబార్షన్ పై నిషేధం ఎత్తివేయాలని 66.4 శాతం మంచి ఓటర్లు మద్దతు పలకగా, 33.6 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. శుక్రవారం జరిగిన రెఫరెండంలో అబార్షన్ పై నిషేధం ఎత్తివేయాలని కోరుతున్న వారికి ఈ ఓటర్ల మద్దత్తు వల్ల భారీ విజయం దక్కింది.  ప్రస్తుతం కేవలం మహిళ ప్రాణాలు ప్రమాదంలో పడ్డప్పుడు మాత్రమే అబార్షన్ కు అనుమతినిస్తున్నారు. అత్యాచారం, అక్రమ సంబంధాలతో గర్భం రావడం, పిండం సహజంగా ఆరోగ్యకరంగా వృద్ధి కేసుల్లో అబార్షన్ కు అనుమతి లేదు. 

ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు వల్ల గర్భస్థ శిశివుకు కూడా తల్లిలాగే జీవించే హక్కు ఉంటుందని చెప్పే 8వ సవరణకు ఇప్పుడు మార్పులు చేయనున్నారు. ఈ డిక్లరేషన్‌ను డబ్లిన్ కాజిల్ దగ్గర ప్రకటించారు. మరోవైపు కేవలం డొనెగల్ నియోజకవర్గంలో మాత్రమే ఈ 8వ చట్ట సవరణ ఉపసంహరణకు వ్యతిరేకంగా 51.9 శాతం మంచి ఓటర్లు మద్దతు పలకడం విశేషం. ఐరిష్ ప్రజలు ఈ ఉపసంహరణకు అనుకూలంగా ఓట్లు వేసిన నేపథ్యంలో పార్లమెంట్ లో ఈ చట్టాన్ని మార్చడానికి ఏ అడ్డంకి లేదు.