వైర‌ల్: పాట ‌పాడి క‌రోనా రోగిలో ధైర్యం నింపి‌న డాక్ట‌ర్...

వైర‌ల్: పాట ‌పాడి క‌రోనా రోగిలో ధైర్యం నింపి‌న డాక్ట‌ర్...

క‌రోనా పేరు వింటేనే అంతా వ‌ణికిపోతున్నారు.. చాలా మంది దాని బారిన ప‌డినా ధైర్యంగా ఎదుర్కొని.. కోలుకుని ఇంటికి చేరుకుంటున్నారు.. అయితే.. కొంత‌మంది మాత్రం.. క‌రోనా అని తెలిస్తే షాక్‌తింటున్నారు.. ఇక‌, క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్‌తో ముందుండి పోరాటం చేస్తున్న క‌రోనా వారియ‌ర్స్ కూడా దాని బారిన ప‌డుతుండ‌గా.. రోగుల్లో మాత్రం ధైర్యాన్ని నింపుతున్నారు... క‌రోనాతో భ‌య‌ప‌డిపోతున్న ఓ మ‌హిళా రోగికి ధైర్యాన్ని చెప్పిన డాక్ట‌ర్‌.. ఎంత‌కీ ఆమెలో భ‌యం పోక‌పోవ‌డంతో... రోగి కోసం ఓ పాట అందుకున్నారు.. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.. పీపీఈ కిట్ ధరించిన వైద్యుడు.. భయంతో వణికిపోతున్న మహిళా రోగిలో ధైర్యాన్ని నింపేందుకు తన గొంతును సవరించారు. రోగి కోసం అరబిక్ భాషలో పాట పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. పాట‌పాడుతూ.. ఆమెకు ధైర్యాన్ని చెబుతూ.. చివ‌ర‌కు త‌ల‌పై ముద్దు ఇవ్వ‌డంతో.. ఆ రోగిలో బాధ మాయం అయిపోయింది.. ఇది ఇరాక్‌లో జ‌రిగినా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌ల్‌గా మారింది.. ఈ వీడియో చూసి నెటిజనులు ఆ వైద్యుడికి సెల్యూట్ చేస్తున్నారు. రోగి ప‌ట్ల ఆ వైద్యుడు చూపించిన ప్రేమ‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.