అర్భాన్ ఖాన్ వ్యవహారంపై ఐపీఎల్ స్పందన

అర్భాన్ ఖాన్ వ్యవహారంపై ఐపీఎల్ స్పందన

ఐపీఎల్‌ బెట్టింగ్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ వ్యవహారంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. బెట్టింగ్‌ రాకెట్‌లో అర్బాన్ పాత్రపై పోలీసులు దాదాపు మూడు గంటలకు పైగా ప్రశ్నించారు. అయితే ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్న ఐపీఎల్... ఎట్టకేలకు నోరువిప్పింది... అర్బాజ్‌ ఖాన్‌తో మాకు ఎటువంటి సంబంధం లేదు... ప్రస్తుతం ఈ విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు... బీసీసీఐ, ఐసీసీకి అవినీతి నిరోధక శాఖలు ఉన్నాయి. పోలీసులు ఎటువంటి సహాయం కావాలన్న ఆ సంస్థల నుంచి పొందవచ్చు అని చెప్పుకొచ్చారు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా. పోలీసులకు అవినీతి నిరోధక శాఖ సహాయం కావాలంటే బీసీసీఐకి ప్రత్యేకమైన శాఖ ఉంది. ఐసీసీకి కూడా ఉంది. ఈ రెండు సంస్థలు ఐపీఎల్ మ్యాచ్‌లను ఎల్లప్పుడు గమనిస్తు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.