ఐపీఎల్ కు ఇప్పుడు కరోనా... తర్వాత వరుణుడు..?

ఐపీఎల్ కు ఇప్పుడు కరోనా... తర్వాత వరుణుడు..?

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే పండగ ఐపీఎల్.. ఈ ఏడాది సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 13 సీజన్  2020 మార్చి 29వ తేదీన ప్రారంభమై.. మే 24వ తేదీన ముగియాల్సింది. అయితే ఈ క్రికెట్ పండుగను కరోనా వైరస్ నిలిపివేసింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుండి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ మన దేశం లోకి కూడా వచ్చిన విషయం తెలిసిందే. అందువల్ల మొదట దేశం లో దేశం 21 రోజుల లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో ఈ 2020 లో జరిగే ఐపీఎల్ మార్చి 29 నుండి ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. అయితే తరువాత కరోనా ప్రభావం  తీవ్రతరం కావడంతో, లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దాంతో బీసీసీఐ యొక్క ఐపీఎల్ పాలక మండలి "ఐపీఎల్ 2020 13వ సీజన్‌ను తదుపరి నోటీసు వచ్చేవరకు నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే తరువాత మళ్ళీ జులై-ఆగస్టు లో ఐపీఎల్ జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి అభిమానులు కూడా అదే ఆశతో ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఐపీఎల్ అభిమానులకు మరో చేదు వార్త వినిపిస్తుంది. అదేంటంటే ఐపీఎల్ కు వరుణుడి ముప్పు ఉంది అని అంటున్నారు. మనకు జులై నుండి వర్షాకాలం ప్రారంభం అవుతుంది. అందువల్ల ఐపీఎల్ ను అప్పుడు ప్రారంభిస్తే చాల మ్యాచ్లు ''వర్షార్పణం'' అవుతాయని బీసీసీఐ భావిస్తుందంట! అందువల్ల వర్షాకాలం తరువాత మాత్రమే ఐపీఎల్ అలాగే మిగితా క్రికెట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి అని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మళ్ళీ అక్టోబర్ వరకు వేచి ఉండాల్సిందే . అయితే అక్టోబర్ 18 నుండి టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఐపీఎల్ అప్పుడు జరగాలంటే ప్రపంచ కప్ ను వాయిదా వేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే మిగితా దేశాల క్రికెట్ బోర్డులు అని అంగీకరించాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.