4 వారాల్లో ఒలింపిక్స్ వాయిదా..?

4 వారాల్లో ఒలింపిక్స్ వాయిదా..?

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వైరస్ ప్రభావం అని రంగాలతో పాటుగా క్రీడారంగం పైన కూడా పడుతుంది. అయితే కరోనా కారణంగా ఐపీఎల్. ఎన్బిఎల్ వంటి ప్రముఖ లీగ్ లతో పాటుగా అని అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు వాయిదా పడ్డాయి. కానీ ఈ సంవత్సరం జులై లో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలంపిక్స్ మాత్రం వాయిదా వేయమని అవి యథావిధిగా జరుగుతాయని టోక్యో గవర్నర్ వెల్లడించారు. అయితే వైరస్ ప్రభావం అంతకంతకు పెరుగుతుండటం తో ఇప్పుడు ఒలంపిక్స్ నిర్వహించాలా లేక వాయిదా వేయాలా అనే సందిగ్ధం లో పడిపోయింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి).

టోక్యో ఒలింపిక్స్ 2020 ను రద్దు చేయడాన్ని పాలకమండలి తిరస్కరించిందని, అయితే 4 వారాల వ్యవధిలో వాయిదా వేయాలని పిలుపునిస్తున్నట్లు ఐఓసి అధ్యక్షుడు థామస్ బాచ్ ఆదివారం చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయడంపై ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లు మరియు క్రీడా సంఘాల నుండి వస్తున్న ఒత్తిడి కారణంగా ఈ విషయం పై నిన్న టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం థామస్ బాచ్ ఈ విషయం చర్చించినట్టు తెలుస్తుంది. అథ్లెట్లకు ఒక లేఖ రాశారు అందులో... పరిస్థితులను చూస్తుంటే ఒలంపిక్స్ ప్రారంభం వాయిదా పడేలా ఉంది అని పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.