ఒలంపిక్స్ వాయిదా పై నిర్ణయం... మళ్ళీ ఎప్పుడంటే..?

ఒలంపిక్స్ వాయిదా పై నిర్ణయం... మళ్ళీ ఎప్పుడంటే..?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వణుకు పుట్టిస్తుంది. అయితే ఈ వైరస్ కారణంగా అని కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అలాగే అని అంతర్జాతీయ క్రీడా టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి లేదా నిలిపివేయబడాయి. కానీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒలంపిక్స్ మాత్రం నిర్వహిస్తాం అని టోక్యో గవర్నర్ తెలిపారు. అయితే కరోనావైరస్ ప్రపంచం అంత వ్యాప్తి చెందుతున్న సమయం లో 2020 ఒలంపిక్స్ నిర్వహిస్తే తమ అథ్లెట్లు అందులో పాల్గొన్నారని  కెనడా వెల్లడించింది. అయితే ఆ తరువాత కొద్దీ సమయం లోనే ఆస్ట్రేలియా కూడా అదే నిర్ణయాన్ని వెల్లడించింది. 

అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అధ్యక్షుడు "డిక్‌పౌండ్‌" ఈ సారి ఒలంపిక్స్ వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తాను అనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు అని తెలియజేసారు. ఒకవేళ ఉంటె 2021 లో ఉండవచ్చును అని అన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే అనేక దేశాలు ఒలంపిక్స్ కమిటీలు, అథ్లెట్లు, ఒలంపిక్స్ ని వాయిదా వేయాలని ఐఓసీ ని కోరాయి. అందువల్లే ఒలంపిక్స్ ను వాయిదా వేయాలని అనుకుంటున్నామని నాలుగు వారాల్లో మిగితా విషయాల పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు డిక్‌పౌండ్‌.