షిప్‌ యార్డ్‌ క్రేన్‌ ప్రమాదంపై రెండు కమిటీలు ఏర్పాటు

షిప్‌ యార్డ్‌ క్రేన్‌ ప్రమాదంపై రెండు కమిటీలు ఏర్పాటు

విశాఖ పట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో జరిగిన క్రేన్‌ ప్రమాదంపై రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు. ఏయూ ఇంజినీరింగ్ నిపుణులతో ఒక కమిటీ, ప్రభుత్వ ఇంజినీరింగ్ అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇక ఈ ప్రమాదంలో 11 మంది  మృతి చెందారని, దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదని చెబుతున్నారు. క్రేన్ ఆపరేషన్‌, మేనేజ్‌మెంట్‌లో మొత్తం మూడు కాంట్రాక్ట్‌ సంస్థలు ఉన్నాయని, మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్ ఉద్యోగులుండగా మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు చెందినవారని చెబుతున్నారు. క్రేన్ కూలిన సమయంలో కేబిన్లో 10 మంది ఉన్నారని చెబుతున్నారు. మృతుల్లో పది మంది వివరాలు గుర్తించామన్న కలెక్టర్ ఒకరి వివరాలను గుర్తించాల్సి ఉందని అన్నారు. షిప్ యార్డ్ ప్రమాదంలో మృతి చెందిన 11 మంది లో 10 మంది పేర్లు గుర్తించారు. ఆ పది మంది పేర్లు ఇలా ఉన్నాయి. 

 1. వెంకట్రావు 
 2. చైతన్య 
 3. రమణ
 4. పివి రత్నం
 5. పి నాగ దేవుళ్ళు.. 
 6. సత్తిరాజు.. 
 7. శివ కుమార్ ... 
 8. కాకర్ల ప్రసాద్.. 
 9. జగన్.. 
 10. పి భాస్కర్  
 11. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది