నిమ్మ‌కూరులో ఎన్టీఆర్ ల‌వ్‌స్టోరి

నిమ్మ‌కూరులో ఎన్టీఆర్ ల‌వ్‌స్టోరి

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి సంబంధించిన స‌న్నాహాలు సాగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. తేజ స్థానంలో ద‌ర్శ‌కుడిగా క్రిష్‌ని ఎంపిక చేశార‌న్న‌ది తాజా అప్‌డేట్‌. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని హాట్ అప్‌డేట్స్ అంత‌ర్జాలంలో లీక‌య్యాయి. 

ఆ వివ‌రాల ప్ర‌కారం... సినిమాలో తొలి 40 నిమిషాలు ఎన్టీఆర్ పాత్ర‌లో తార‌క్ (జూ.ఎన్టీఆర్‌) కానీ, నాని లేదా శ‌ర్వానంద్ కానీ న‌టించే అవ‌కాశం ఉందిట‌. అలానే నిమ్మ‌కూరులో నూనూగు మీసాల ఎన్టీఆర్ ల‌వ్‌స్టోరి సినిమాకే హైలైట్‌గా ఉంటుంద‌ని స‌మాచారం. ఎన్టీఆర్ యుక్త‌వ‌య‌సులో ఉన్న‌ప్పుడు నిమ్మ‌కూరులో త‌మ ఇంటికి వ‌చ్చి పాలు పోసే అమ్మాయికి లైనేసేవార‌ట‌. ఆ క్ర‌మంలోనే ఎన్టీఆర్ త‌ల్లిదండ్రులు బ‌స‌వ‌తార‌కంని ఇచ్చి పెళ్లి చేశారు. వాస్త‌వానికి ఆ పెళ్లి ఎన్టీఆర్ ఇష్టానికి విరుద్ధంగా జ‌రిగింది. అయితే పెళ్లి త‌ర‌వాత తార‌క‌రాముడు భార్య‌ను ఎంత‌గానో ప్రేమించారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో మెలోడ్రామా, వాస్త‌విక‌త ఉంటుంది. అలాంటి వాస్త‌వాల్ని య‌థాత‌ధంగా చూప‌డం ద్వారా ప్రేక్ష‌కాభిమానుల్లో ఎమోష‌న్ పెంచాల‌ని న‌ట‌సింహా బాల‌కృష్ణ ఎలాంటి జంకూ లేకుండా ఈ స్క్రిప్టును తీర్చిదిద్దార‌ని చెబుతున్నారు. ఈ సినిమాని బాల‌కృష్ణ‌ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.