వాయిదాపడ్డ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు..!

వాయిదాపడ్డ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు..!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో వాయిదా పడ్డ ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేసింది. జూన్‌ 3వ తేదీన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలకు హాజరుకాలేకపోతే మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుందన్నారు. జులై 3వ వారంలో జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనా రెగ్యూలర్ గానే పరిగణిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి తెలిపారు.