ఇన్స్టాగ్రామ్ లో టిక్ టాక్ ఫీచర్స్..!

ఇన్స్టాగ్రామ్ లో టిక్ టాక్ ఫీచర్స్..!

భారత్-చైనా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత్ దేశంలో చైనా యాప్ లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టిక్ టాక్ సహా దేశంలో 59 ఆప్ లను ప్రభుత్వం నిషేదించింది. కాగా టిక్ టాక్ కు మన దేశం లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని పలు యాప్ లు టిక్ టాక్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే యూ ట్యూబ్ టిక్ టాక్ మాదిరిగా 15 సెకన్ల వీడియోను తీసే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావటనికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సైతం టిక్ టాక్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయోగాలు మొదలు పెట్టిందట. ఇప్పటికే గతంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనే ఫీచర్ ను తీసుకువచ్చింది. దానిపై ఫ్రాన్స్, జర్మనీలో ప్రయోగాలు చేసింది కూడా అది అచ్చం టిక్ టాక్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుందట. ఇప్పుడు దానిని భారత్ లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇన్స్టాగ్రామ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.