భారత్-ఇంగ్లాండ్ సిరీస్ వాయిదా... ఐపీఎల్ కోసమేనా..?

భారత్-ఇంగ్లాండ్ సిరీస్ వాయిదా... ఐపీఎల్ కోసమేనా..?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా చాలా అంతర్జాతీయ సిరీస్లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు అందులో మరో సిరీస్ చేరనుంది. కరోనా కారణంగా వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఆరు మ్యాచ్‌ల పరిమిత-ఓవర్ల సిరీస్‌(3 వన్డే, 3 టీ 20)లను బీసీసీఐ వాయిదా  వేయనున్నట్లు తెలుస్తుంది. ఈ  పర్యటనతో పాటుగా  న్యూజిలాండ్-ఎ జట్టు భారత పర్యటన కూడా వాయిదా పడనుంది అని తెలుస్తుంది. అయితే ఈ వాయిదాలకు కారణం కరోనా అని చెబుతున్న అసలు కారణం ఐపీఎల్ అని అంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ లో జరగాల్సిన ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ జరిగే సూచనలు లేకపోవడంతో ఆ విండోలో ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ ప్రయత్నిస్తుంది. కానీ ఐసీసీ ఇంకా  ప్రపంచ కప్ వాయిదా అధికారికంగా ప్రకటించకపోవడంతో బీసీసీఐ కూడా ఐపీఎల్ నిర్వహిస్తునట్లు చెప్పడం లేదు. అయితే ఇన్ని రోజులు ఆ సమయంలో ఆసియా కప్ నిర్వహిస్తాము అన్ని ఎగిరిన పాకిస్థాన్ బోర్డు ఆ టోర్నీ వాయిదా పడటంతో చతికలపడిపోయింది. ఇక ఈ రోజు జరిగే  బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో భారతదేశ ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టిపి) క్యాలెండర్ ప్రధాన చర్చనీయాంశంగా ఉంటుంది. ఈ సమావేశం తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ వాయిదా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.