హెచ్-1బీల్లో మనమే టాప్‌

హెచ్-1బీల్లో మనమే టాప్‌

అగ్రరాజ్యం అమెరికా అందించే హెచ్‌-1బీ వీసాల్లో అత్యధికం మనకే అందుతున్నాయని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం  2016, 2017ల్లో జారీ అయిన హెచ్‌-1బీ వీసాల్లో 74 శాతానికిపైగా భారతీయులకే దక్కాయి. భారత్‌ తర్వాత చైనాకు ఎక్కువగా అందుతున్నాయి. 2016లో హెచ్‌-1బీ వీసాల కోసం 3,98,718 దరఖాస్తులు రాగా.. 3,45,262 ఆమోదం పొందాయి. వీటిలో 74.2(2,56,226) శాతం భారతీయులకకే అందాయి. 2017లో హెచ్‌-1బీ వీసాల కోసం 4,03,675 దరఖాస్తులందగా 3,65,682 ఆమోదం పొందాయి. వీటిలో 75.6 శాతం(2,76,423)  భారతీయులే దక్కించుకున్నారు. ఇక.. చైనీయులు.. 2017లో జారీ చేసిన వీసాల్లో 9.4 శాతం, 2016లో జారీ చేసిన వీసాల్లో 9.3 శాతం  అందుకున్నారు.