ఏడాది కనిష్టానికి బియ్యం ధర...

ఏడాది కనిష్టానికి బియ్యం ధర...

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో రూపాయి విలువ 16 నెలల కనిష్టస్థాయికి పడిపోయింది... దీంతో భారత్‌లో బియ్యం ధరలు తగ్గుముఖం పట్టింది. వరుసగా మూడో వారంలోనూ బియ్యం రేట్ తగ్గడమే కాదు... ఏడాది కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇండియన్ వెరైటీకి చెందిన బియ్యం ధర 10 డాలర్లు తగ్గింది. ఇప్పుడు టన్ను బియ్యం 394 - 398 డాలర్లుగా పలుకుతోంది. మార్కెట్‌లో ఇండియన్ రైస్... థాయ్‌లాండ్, వియత్నాం ఉత్పత్తి చేసే బియ్యానికి తీవ్రమైన పోటీ ఇస్తుంది... అయితే ఆర్డర్లు డాలర్ల రూపంలో ఉండడంతో భారత్‌లో బియ్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయని పూణెలోని ఓ ఎగుమతిదారుడు చెబుతున్నారు. 2018లో రూపాయి దాదాపు 7 శాతం పడిపోవమే దీనికి కారణమంటున్నారు. 

ఇక పొరుగూనే ఉన్న బంగ్లాదేశ్‌లో 19 మిలియన్ టన్నుల టార్గెట్‌ను ఛేదించి 19.7 మిలియన్ టన్నులు బియ్యాన్ని ఎగుమతి చేసింది. దీనికి తోడు బియ్యం ధరలను కూడా పెంచేశారు. ఇక థాయిలాండ్ బెంచ్‌మార్క్ రైస్ ధర టన్నుకు ఈ వారం 435- 438 డాలర్లుగా ఉంది. గత వారం ఈ ఇది 435 - 440 డాలర్లుగా పలికింది. అయితే మరోవైపు బియ్యం కోసం ఇరాక్, మలేషియా వంటి మార్కెట్ల నుండి కొంత ఆసక్తి ఉన్నా... ఇప్పటి వరకూ ఎలాంటి ఒప్పందం జరగలేదు. వియత్నాంలో గత వారంలో టన్ను రైస్ ధర 460 నుంచి 465 డాలర్లుగా పలుకుతూ గత ఆగస్టు నుంచి బలమైన స్థాయిలో ఉంది.