గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ రైల్వేస్ : మరో 90 రైళ్లు  సిద్ధం... 

గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ రైల్వేస్ : మరో 90 రైళ్లు  సిద్ధం... 

మార్చి 22 వ తేదీ నుంచి దేశంలో ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం 230 స్పెషల్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి.  సాధారణ రైళ్లు ఆగష్టు 12 వరకు నడపబోమని ఇప్పటికే రైల్వేశాఖ తెలియజేసింది.  అయితే, ఇప్పుడు తిరుగుతున్న 200 రైళ్లతో పాటుగా  అదనంగా మరో 90 రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది.  

మరో వారం రోజుల్లోనే రైల్వేశాఖ ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.  ఈ రైళ్లకు సంబంధించిన వివరాలను రైల్వేశాఖ కేంద్ర హోంశాఖకు సమర్పించింది.  అక్కడి నుంచి అనుమతులు రాగానే ఈ 90 రైళ్లు అందుబాటులోకి వస్తాయి.   అందుబాటులోకి వచ్చిన తరువాత ఐ.ఆర్.సి.టి.సి ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు.  120 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వేశాఖ తీసుకొస్తున్నది.