'స్పెల్‌ బీ'లో సత్తాచాటిన తెలుగబ్బాయి

'స్పెల్‌ బీ'లో సత్తాచాటిన తెలుగబ్బాయి

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్ షిప్‌'లో తెలుగు తేజం మెరిసింది. ఈసారి కూడా టైటిల్‌ భారతీయుడినే వరించింది. అన్ని రౌండ్లలో కలిపి మొత్తం 515 మందిని వెనక్కు కార్తీక్ నెమ్మని అనే 14 ఏళ్ల భారతీయ సంతతి బాలుడు టైటిల్ కైవసం చేసుకున్నాడు. మేరీల్యాండ్‌లో జరిగిన ఫైనల్ పోరులో 'koinonia' అనే పదాన్ని సరిగ్గా పలికి ఛాంపియన్ షిప్‌ నెగ్గాడు.  తద్వారా ఈ ఘనతను సాధించిన 14వ భారతీయ సంతతి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అవార్డు కింద కార్తీక్‌కు 42 వేల అమెరికా డాలర్లు బహుమతితోపాటు ట్రోఫీ, మెరియం-బస్టర్ నుంచి 2,500 డాలర్ల నగదు.. రిఫరెన్స్ లైబ్రరీకి ఫ్రీ యాక్సెస్‌ కూడా ఇస్తారు. పోటీల చివరి రౌండ్‌లో కార్తీక్‌కు భారత సంతతికే చెందిన నయాసా మోడీ గట్టిపోటీనిచ్చింది. టెక్సాస్‌లోని మెక్‌కిన్నీ ప్రాంతంలో కార్తీక్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఈ పోటీలకు అమెరికా, కెనడాతో పాటు గతంలో ఈ పోటీల్లో పాల్గొన్నవారు సైతం హాజరయ్యారు.