భారతీయ ఇంజనీర్లు కిడ్నాప్...

భారతీయ ఇంజనీర్లు కిడ్నాప్...

అఫ్గానిస్థాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు కిడ్నాప్ కు గురయ్యారు. వివరాల ప్రకారం... ఉత్తర బగ్లాన్‌ ప్రావిన్స్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ పవర్‌ ప్లాంట్‌లో ఈ ఏడుగురు భారతీయులు పనిచేస్తున్నారు. నిర్వహణలో భాగంగా పవర్‌ప్లాంట్‌కు ఇంజినీర్లు మినీ బస్సులో వెళ్తుండగా.. గుర్తుతెలియని దుండగులు తుపాకులు చూపించి అడ్డుకున్నారు. అఫ్గాన్‌ వాహన డ్రైవర్‌ భయంతో బస్సును నిలిపివేశాడు. ఏడుగురు ఇంజినీర్లతో సహా డ్రైవర్ ను కూడా కిడ్నాప్ చేశారు దుండగులు. కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. భారత ఇంజినీర్లను విడిపించేందుకు తగిన చర్యలు ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏ సంస్థ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.