డే/నైట్‌ టెస్ట్‌కు బీసీసీఐ నో..

డే/నైట్‌ టెస్ట్‌కు బీసీసీఐ నో..

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్‌తో డే/నైట్‌ టెస్టు ఆడించేందుకు ప్రయత్నించిన క్రికెట్‌ ఆస్ట్రేలియాకు బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనలో డే నైట్‌ టెస్ట్‌ ఆడేందుకు సిద్దంగా లేమని స్పష్టం చేసింది బీసీసీఐ. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రతీ జట్టుతో ఆసీస్ డే/నైట్‌ టెస్ట్‌ను ఆడుతున్నారు. ఈ క్రమంలో భారత్‌ కూడా ఆడాలని సీఏ కోరింది.

అయితే డే/నైట్‌ టెస్టు ఆడాలంటే.. ఆటగాళ్లకు కనీసం 18 నెలల ప్రాక్టీస్‌ అవసరమని భారత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రీ సీఓఏకు స్పష్టం చేసాడు. దీంతో బీసీసీఐ తాత్కలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి.. సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌కు డేనైట్‌ మ్యాచ్‌ ఆడలేమని సమాచారమిచ్చాడు. ఈ సంవత్సరం నవంబరు 21 నుంచి జనవరి 19 వరకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ-20లు ఆడనుంది. డిసెంబర్‌ 6 నుంచి అడిలైడ్‌ వేదికగా జరిగే టెస్టును.. డే/నైట్‌ టెస్ట్‌గా నిర్వహించాలని సీఏ భావించింది. అయితే డే/నైట్‌ టెస్ట్‌ ఆడబోమని భారత్‌ స్పష్టం చేసింది.