యూఎన్ రిపోర్టుపై ఇండియా ఫైర్‌

యూఎన్ రిపోర్టుపై ఇండియా ఫైర్‌

జమ్మూ కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని యూఎన్ రిపోర్టు చెబుతోంది. ఈ రిపోర్టును భారత్‌ ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే యూఎన్‌ జమ్మూ కశ్మీర్‌పై ఈ రిపోర్టును ప్రచురించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌, పాకిస్తాన్‌లు కశ్మీరీల మనోభావాలను గౌరవించాలని రిపోర్టులో చెప్పింది. 2016 జులైలో హిజ్బుల్‌ మొజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వానీని బలగాలు తుదముట్టించిన దగ్గర నుంచి కశ్మీర్‌ వ్యాలీలో అశాంతి ఉందని తన రిపోర్టులో వెల్లడించింది. ఈ మేరకు యూఎన్‌ మానవ మానవహక్కుల విభాగం చీఫ్‌ జైద్‌ రాద్‌ అల్‌ హుస్సేన్‌ 2016 నుంచి కశ్మీర్‌లో మరణాలపై విచారణ చేయాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో బలగాల మొహరింపు, పెల్లెట్ల వినియోగంపై మానవహక్కుల విభాగం విచారణ చేయనుంది. వచ్చే వారం జరగనున్న సమావేశంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని జైద్‌ వెల్లడించారు.