భారత్‌కు చైనా కంపెనీలు..ఏడారిలో ఎండమావి లాంటిదే

భారత్‌కు చైనా కంపెనీలు..ఏడారిలో ఎండమావి లాంటిదే
దేశంలో ఇప్పడు మన దేశం-మన వస్తువులు అనే విధానం బలంగా వినిపిస్తుంది..కరోనాతో ఒక వైపు దేశం పోరాడుతుంటే మరోవైపు ప్రధాని మోడీ మన దేశం-మన వస్తువులు స్లోగేన్‌ ఇవ్వడంతో  ప్రజల్లో చర్చ మొదలైంది...మనిషి ఆశాజీవి కనుక దారీ తెన్నూ కనిపించనపుడు ఏ చిన్న వెలుగు కనిపించినా, ఏ కాస్త శుభవార్త చెప్పినా పోయేదేముంది చూద్దాం అని గుడ్డిగా నమ్మేస్తాడు...ఏం జరిగిన సర్దుకుపోయే స్ధితిలో మన సమాజంలో ఉన్నాం...

గత కోద్దీ రోజులుగా భారత్‌కు పెద్ద సంఖ్యలో చైనా కంపెనీలు వస్తున్నాయని సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ప్రధాన స్రవంతి తెలుగు మీడీయాలో ఒక వార్త చక్కర్లు కోడుతుంది...ఇక జాతీయ మీడియాలో  దాని ప్రాపగాండకు అడ్డులేకుండా పోతుంది... చైనాలో కరోనా ఎక్కువగా ఉంది...ప్రభుత్వం తన పాలసీలు,చట్టాలు మార్చుతుందని ఒక ప్రచారం జరుగుతుంది..చైనా నుంచి అనేక అంతర్జాతీయ కంపెనీలు బయటకు వస్తున్నాయని ఐరోపా మీడియా విసృతంగా ప్రచారం చేస్తున్నాయి...అనేక వర్తనమాన దేశాలు మరి ముఖ్యంగా భారత్‌ వంటి యంగ్‌ దేశానికి  ఇది మంచి అవకాశం అని కరోనా మీడియా ఊదరకోడుతున్నాయి...

ఆ ప్రచారాన్నే మన పాలకులు కూడా తమ రాజకీయ ప్రసంగాలతో ఊదరకోడుతున్నారు...కరోనా భారత్‌కు మంచి అవకాశాలను కల్పించందంటూ ప్రసంగాలు చేస్తున్నారు...సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా నుంచి మన దేశానికి వాణిజ్య, పారిశ్రామిక సంస్ధలు ముఖ్యంగా అమెరికాకు చెందినవి తరలి రానున్నట్లు కొద్ది రోజులుగా ట్రోల్‌ చేస్తున్నారు...సాక్షాత్తూ ప్రధాని మోడీయే అందుకు తెరలేపారంటే అతిశయోక్తి కాదు....

చైనా నుంచి రాబోయే కంపెనీల కోసం ముందుగానే స్ధలాలు, పొలాలను సిద్ధం చేస్తున్నామని, అందరికంటే ముందుగా ఎగిరి అందుకోవటానికి సిద్ధంగా ఉండాలని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సన్నాహాలు చేస్తున్నారు....అందుకు సంబందించిన చట్టాలలో మార్పులు చేయాలి విజ్ఞప్తి  చేయడం కొసమెరుపు...

ప్రధాని మాటలతో గతంలో నమ్మి దెబ్బతిన్నవారు వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు... అనుమానాలను వ్యక్తం చేస్తున్నవారి మీద ఒక వర్గం ద్వేషాన్ని ప్రజల్లో పెంచుతున్నారు... మీరసలు దేశభక్తులేనా, ఒక వేళ వస్తే గిస్తే మీకేమైనా ఇబ్బందా, చైనాయే అభివృద్ది చెందాలా? మనం వెనుకబడిపోవాలాని అని కొందరు వీరావేశంతో ఎదురు దాడికి దిగుతున్నారు...

ప్రపంచ వ్యాపితంగా కరోనాకు ముందే ఆర్ధిక సంక్షోభ ఛాయలు ముసరటం ప్రారంభమైంది..దాని ప్రభావం మన దేశం మీద పరోక్షంగా కనిపించింది...అనేక రాష్ట్రాలు,కేంద్ర బడ్జెట్ లో కోతలు పెట్టిన సంగతి తేలిసిందే.... ఈ ఏడాది దేశ జిడిపి వృద్ధి రేటు ఎంతశాతమన్నది తప్ప తిరోగమన దిశలోనే ఉండబోతున్నది... కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులకు  పని ఉండదనే అనేక అంతర్జాతీయ సంస్థలు అంచనాలను  వెలువడిస్తున్నాయి... ఇది మన కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీస్తుందని, ఇప్పటికే ఉన్న కంపెనీల ఉత్పత్తులనే కొనుగోలు చేసే వారు తగ్గిపోయినట్లు నివేదికలు వెలువడిన విషయం తెలిసిందే...

అలాంటపుడు చైనా, మరొక దేశం నుంచి వచ్చే కంపెనీలు తయారు చేసే వస్తువులను భారత్‌ కొనే దెవరు?...కార్పోరేట్ కంపెనీలు లాభాలు లేకుండా తన ఉత్పత్తులు చేస్తుందా, అంతేకాకుండా కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలతో ఒక వేళ అవి చౌకగా తయారు చేస్తే పోటీకి తట్టుకోలేక ఉన్న మన దేశీయ  కంపెనీలు మూత పడే అవకాశాలు లేకపోలేదు... ఇప్పుడు మన దేశంలో కొత్తగా పెట్టేవైనా, విదేశాల నుంచి వచ్చేవైనా కార్మికులు తక్కువ-యాంత్రీకరణ ఎక్కువ అన్నది తెలిసిందే...70 శాతం  అక్షరాస్యత ఉన్న మన దేశంలో  కొత్త సాంకేతికతోన అవి కొత్త సమస్యలను తీసుకువస్తాయి...

ఒక వైపు విదేశీ వస్తువులు వద్దు,స్వదేశీయే ముద్దు అనే కొత్త పల్లవిని మన పాలకులు అందుకున్నారు... తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు, చైనా నుంచి అరువు తెచ్చుకొని లేదా అనుకరించి మనం లాక్‌డౌన్‌ అమలు జరిపినట్లే మన స్వదేశీ పిలుపును చూసి ఇతరులూ అమలు జరపరా? ప్రపంచమంతటా కరోనా వైరస్‌ సమస్య ఉంది కదా !... మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అట్టహసంగా మన మేకిన్‌ ఇండియా పిలుపును ఇచ్చారు...ఇప్పటి నుంచి అన్ని కంపెనీలు మన దేశంలోనే ఉత్పత్తి తయారు చేస్తాయని, మన జీడీపీ పెరుగుతుందని ప్రకటించాడు....కాని నినాదం దారుణంగా విఫలమైంది, ఇప్పుడు మేకిన్‌ ఇండియా పిలుపు వలన ప్రయోజనం ఏమిటి?,ఎంత వరకు పని చేస్తుంది...అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న మన దేశం సడేన్‌గా మన వస్తువు-మన  దేశం ప్రకటనను ఎంత వరకు స్వాగతిస్తాయి, యూఎన్‌లో చేసుకున్న ఒప్పందాలకు ఇబ్బందులు కలిగితే అవి ఊరికే ఉంటాయా?..అంతర్జాతీయంగా మనపై ఒత్తిడి తీసుకురాకుండా ఉంటాయా?...ఇప్పడు మన దేశంలో  భాగంగా తయారు చేసే వస్తువులను ఏ దేశానికి ఎగుమతి చేస్తాము? ఇవన్నీ ఆలోచించాలా వద్దా ?

ఏ దేశానికి ఆదేశం మరొక దేశంతో పోటీబడి అభివృద్ది చెందితే అభ్యంతరం ఎవరికి ఉంటుంది. ఎదుటివారిని దెబ్బతీసి మనం లాభపడాలనుకుంటే ఎదుటి వారు కూడా మన గురించి అదే అనుకుంటారు అని గ్రహించటం అవసరం...

ఓ బిజినెస్ వార్త  పత్రిక ప్రకారం వెయ్యి విదేశీ కంపెనీలు ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాయని కనీసం 300 సంస్ధలను రప్పించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పారు.. ఇవన్నీ చైనా నుంచే వస్తాయా? ఇతర దేశాల నుంచి వస్తాయి అనేది స్పష్టత లేదు....

అసలు చైనాలో ఉన్న విదేశీ కంపెనీలు ఎన్ని ? 2018 రికార్డుల ప్రకారం చైనాలో దాదాపుగా 9 లక్షల 70 వేలపైగా ఉన్నట్లు సమాచారం...వీటిలో ఎన్ని కంపెనీలు భారత్‌ రావడానికి సిద్దంగా ఉన్నాయి?...ఇందులో వెయ్యి కాదు కదా మరో పదివేలు భారత్‌కు వచ్చిన చైనాకు ఎలాంటి నష్టం ఉండదు...

చైనా దెబ్బకు అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న  అమెరికాయే గిలగిల్లాడుతుంటే మనం తట్టుకోగలమా ? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి ?..చైనా కంపెనీలు విదేశాలకు పోక ఎప్పటికి స్థిరంగా ఉండలేవు కదా...లాభార్జనే వాటి ద్యేయం...ఎక్కడ లాభాలు ఉంటే అక్కడి వెలుతాయి..దాని వింతైన విషయం ఏమీ లేదు.... మన దేశానికి రాక గురించి ఊరించటం కొత్త కాదు గత ఐదు సంవత్సరాలుగా కోనసాగుతూనే ఉంది...

మరోవైపు తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేసే సంస్దలలో మెజారిటీ ఉద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని అనేక రాష్ట్రాలు చట్టాలను చేశాయి...తమ కంపెనీలలో తాము ఎంపిక చేసుకున్న సిబ్బందినే పెట్టుకోవాలని కోరుకొనే కంపెనీలకు ఈ చట్టాలు ఆటంకంగానే కనిపిస్తాయి... చైనా నుంచి వస్తాయని చెబుతున్న కంపెనీలలో ఎక్కువ భాగం అమెరికాకు చెందినవిగా చెబుతున్నారు. అవే ఎందుకు ఆసక్తి కనపరుస్తున్నాయి? ఒక వైపు ట్రంప్‌ అమెరికాలో పెట్టుబడులు, పరిశ్రమల స్ధాపనకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాడు... చైనా మీద ఆధారపడిన కారణంగానే అమెరికాలో ఇబ్బందులు తలెత్తాయన్నట్లుగా మాట్లాడుతున్నాడు..అందుకే ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో తమ దేశంలోని కంపెనీలు యూఎస్‌ వారికే ఉద్యోగాలు ఇవ్వాలని ఓత్తిడి చేస్తున్నారు...అనేక రాయితీలు కూడా ప్రకటిస్తున్నాడు..

 అలాంటపుడు చైనాలోని అమెరికా కంపెనీలు తమ దేశానికి పోకుండా మన దేశానికి ఎందుకు రావాలని కోరుకుంటున్నాయి... వాటికి దేశభక్తి లేదా ? మన దేశాన్ని ఉద్దరించాలనే సదాశయంతో వస్తున్నాయా ? 2018 నుంచి డోనాల్డ్‌ ట్రంప్‌ చైనాతో వాణిజ్య యుద్ధం చేస్తున్నాడు...

అయితే అసలు చైనా నుంచి విదేశీ కంపెనీలు తరలిపోవటం లేదా ? లేదని ఎవరు చెబుతారు ? లాభాల కోసం తమ స్వంత దేశాలను వదలి చైనా వచ్చిన కంపెనీలు మరొక దేశంలో లాభం ఎక్కువ వస్తుందనుకుంటే అక్కడికి తరలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది... పెట్టుబడి లక్షణమే అది. పెట్టుబడులను ఆకర్షించేందుకు మోడీ సర్కార్‌ అనేక చర్యలు తీసుకుంది, రాయితీలు ప్రకటించింది, కార్మిక చట్టాలను నీరుగార్చింది. సులభతర వాణిజ్యం ర్యాంకులో ముందుండటం కోసం పోటీ పడుతోంది...ఐదు దశలుగా ప్రకటించిన 20లక్షల కోట్లు కూడా ప్రైవేట్ కంపెనీలకు ప్రోత్సహించడానికి మొగ్గుచూపింది....అనేక భారతీయ కంపెనీలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతించింది...2018 నుంచి చైనా నుంచి బయటకు వస్తున్న కంపెనీలలో మన దేశానికి కేవలం మూడుమాత్రమే వచ్చినట్లు పలు సంస్థలు నివేదించాయి...

బాధ్యత కలిగిన వారెవరైనా వెనుకా ముందూ చూసుకోవాలి, చర్యకు ప్రతి చర్య పర్యవసానాల గురించి ఆలోచించకుండా ముందుకు పోతే గోతిలో పడతారు... ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విదేశీమారక ద్రవ్యం గణనీయంగా ఉన్న తొలి పది దేశాలలో మనది ఐదవ స్ధానం. అయితే తొలి స్ధానంలో ఉన్న చైనా దగ్గర 3,091, ఉన్నాయి...మన దేశం అక్కడి పరిశ్రమలను ఆహ్వానించి చైనాతో వాణిజ్య యుద్దానికి దిగితే ఏమి జరుగుతుందో ఆలోచించుకోవాలి... మన దేశానికి చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఆర్ధికవేత్త అభిజిత్‌ ముఖర్జీ ఒక బెంగాలీ టీవీతో మాట్లాడుతూ ఒక వేళ చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే ఏం జరుగుతుంది ? దాని వస్తువుల ధరలు తగ్గుతాయి, జనాలు వాటినే కొంటారు అన్నారు...ప్రపంచంలో గత కొద్ధి సంవత్సరాలుగా దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితిని కరోనా వైరస్‌ తాత్కాలికంగా అయినా మరింతగా దిగజార్చీంది....

2019లో చైనా నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకున్న తొలి పదిహేను దేశాలలో మూడు శాతంతో మనది ఏడవ స్ధానంలో వుంది. అంటే మిగిలిన దేశాలన్నీ 97శాతం వాటా కలిగి ఉన్నాయి. మన మూడుశాతం నిలిపివేస్తే చైనాకు వచ్చే నష్టం ఏముంటుంది? అగ్రస్ధానంలో ఉన్న అమెరికాకు చైనా 16.8శాతం ఎగుమతి చేస్తోంది. అలాంటి దేశ అధ్యక్షుడు ట్రంప్‌ను చైనీయులు మూడు చెరువుల నీరు తాగించి తమ కాళ్ల బేరానికి తెచ్చుకుంటున్నారు...

ఇక మన దేశ వాణిజ్య భాగస్వాములలో చైనా 2019లో 5.08శాతంతో మూడవ స్ధానంలో ఉంది. తొలి రెండు స్ధానాలలో అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌ ఉన్నాయి. చైనా ఎగుమతి చేసే వందలో మూడు వస్తువులను మనం తెచ్చుకుంటుంటే, మనం ఎగుమతి చేసే వందలో చైనా ఐదింటిని తీసుకొంటోది. పరిస్ధితి ఇలా ఉంటే మనం చైనాను కాళ్లబేరానికి తెచ్చుకోవటం ఏమిటి? మతి ఉండే ఆలోచిస్తున్నామా ? మన ఘనమైన సంస్కృతి ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పింది తప్ప దురహంకారానికి లోను కమ్మని చెప్పలేదు...