ప్రపంచంలో విస్కీని అత్యధికంగా సేవించే వ్యక్తులు ఎవరో తెలుసా?

ప్రపంచంలో విస్కీని అత్యధికంగా సేవించే వ్యక్తులు ఎవరో తెలుసా?

కరోనా కు ముందు ప్రపంచం మొత్తం మద్యం మత్తులో జోగుతుండేది.  రోజుకు లక్షల లీటర్ల మద్యం సేల్స్ అవుతున్నది. కరోనా పుణ్యమా అని మద్యం అమ్మకాలు ఆగిపోయాయి.  ప్రపంచం సంగతి పక్కన పెడితే, ఇండియాలో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో ఉంటాయి.  ఇండియాకు వచ్చే ప్రధాన ఆదాయంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా ఒకటి.  ఒకప్పుడు ఎవరైనా మద్యం తీసుకుంటే వాళ్ళను ఏదోలా చూసేవారు.  కానీ, ఇప్పుడు మనిషి జీవనంలో ఒక భాగం అయ్యింది.  

రోజుకు లక్షల లీటర్ల మేర మద్యం సేల్ అవుతున్నది. విదేశాల్లో విస్కీ అత్యధికంగా సేల్ అవుతుందని అనుకుంటూ ఉంటారు.  కానీ, ఇది ముమ్మాటికీ రాంగ్ అని చెప్పుకోవాలి.  ప్రపంచంలో విస్కీని అత్యధికంగా సేవించే వ్యక్తులు భారతీయులు.  భారతదేశంలో విస్కీ అత్యధికంగా అమ్ముడు పోతుంది.  లెక్కల ప్రకారం 2016 ప్రపంచంలో 399.2 మిలియన్ నైన్ లీటర్ కేసులు అమ్మకాలు జరిగితే, ఒక్క ఇండియాలో 193.1 మిలియన్ నైన్ లీటర్ కేసులు అమ్మకం జరిగింది.  దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఇండియాలో మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో.  ఒక్క విస్కీనే ఈ స్థాయిలో అమ్మకం జరిగితే, మిగతా బ్రాండ్ ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  ఇక లిక్కర్ నుంచి ఇండియాలో సంవత్సరానికి రూ.2.48 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది.  ఇక కేరళలో ఒక్కొక్కరు 8.4 లీటర్ల మద్యం సేవిస్తే, పంజాబ్ లో 7.9 లీటర్ల మద్యం సేవిస్తున్నట్టు నీతి ఆయోగ్ లెక్కలను బట్టి తెలుస్తోంది. సంవత్సరానికి 57 మిలియన్ మందిపై మద్యం ప్రభావం చూపిస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.