మ‌రో దేశాన్ని వెన‌క్కి నెట్టిన భార‌త్.. క‌రోనా లిస్ట్‌లో మూడో స్పాట్‌కు...

మ‌రో దేశాన్ని వెన‌క్కి నెట్టిన భార‌త్.. క‌రోనా లిస్ట్‌లో మూడో స్పాట్‌కు...

క‌రోనా వైర‌స్ కేసుల విష‌యంలో మ‌రో దేశాన్ని వెన‌క్కి నెట్టింది భార‌త్.. క‌రోనా పాజిటివ్ కేసుల్లో ఇప్పుడు భార‌త్ మూడో స్థానానికి చేరుకుంది.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడోస్థానంలో ఉన్న ర‌ష్యాను వెన‌క్కి నెట్టి పైకి ఎగ‌బాకింది.. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం (జేహెచ్‌యూ) ప్రకారం 6.8 లక్షల పాజిటివ్ కేసులు ఉన్న రష్యాను అధిగమించింది భార‌త్‌.. 6.9 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు చేసి మూడోస్థానానికి చేరింది. ఇక‌, ఈ లిస్ట్‌లు 15 ల‌క్ష‌ల కేసుల‌తో బ్రెజిల్, 28 ల‌క్ష‌ల పాజిటివ్ కేసుల‌తో అమెరికా మాత్ర‌మే భార‌త్ కంటే ముందున్నాయి. ఆదివారం దేశ‌వ్యాప్తంగా రికార్డుస్థాయిలో కేసులు న‌మోదు అయ్యాయి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌కారం 24 గంటల్లో25 వేల కొత్త కేసులు న‌మోదు కాగా.. 613 మంది మృతిచెందారు. భార‌త్‌లో క‌రోనా కేసులు వేగంగా విస్త‌రించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.