టాప్‌ 20 కాలుష్య నగరాల్లో భారత్‌లోనే 14

టాప్‌ 20 కాలుష్య నగరాల్లో భారత్‌లోనే 14

భారత్ మరో నయా రికార్డు కైవసం చేసుకుంది... ఇది మామూలు రికార్డు కాదు... పరమచెత్త రికార్డు. ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాలైన టాప్ 20 నగరాలను ప్రకటిస్తే... ఆ జాబితాలో 14 నగరాలు మన దేశంలోనివే అంటూ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అత్యధిక కాలుష్య నగరాలు ఇండియాలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇక టాప్ 20లో దేశ రాజధాని ఢిల్లీ, వారణాసి, పాట్నా టాప్ స్పాట్‌లో ఉండగా... ఆ సిటీల్లో ప్రతి క్యూబిక్‌ మీటర్ గాలిలో 2.5 మైక్రో ఆర్గామ్స్ ఉన్నాయని ప్రకటించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఈ జాబితాలో చైనాలోని జింగ్‌గయ్, షాజియాజువాంగ్, సౌదీలోని జుబైల్, భారత్‌లోని కాన్పూర్, ఫరిదాబాద్, గయా, పట్నా, అగ్రా, ముజఫర్, శ్రీనగర్, గుర్‌గావ్, జైపూర్, పటియాలా, జోద్‌పూర్‌లు  ఉన్నాయి. ఇక కాలుష్య నివారణ విషయంలో భారత్ ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో... డ్రాగన్ కంట్రీ కాలుష్య నివారణకు చర్యల మాదిరిగానే భారత్‌ కూడా కాలుష్యంపై యుద్ధం చేయాలని వెల్లడించింది. మరోవైపు సంచలన విషయాలను బటయపెట్టింది ఈ నివేదిక... ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమందిలో తొమ్మిది మంది పీల్చేది కలుషిత గాలేనని స్పష్టం చేసింది. దీనివల్ల ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఏడాదికి 7 మిలియన్ల మంది మృత్యువాత పడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో పేర్కొంది.