చైనా మార్షల్ సైనికులకు ధీటుగా... వీరిని రంగంలోకి దించిన ఇండియా 

చైనా మార్షల్ సైనికులకు ధీటుగా... వీరిని రంగంలోకి దించిన ఇండియా 

గాల్వాన్ లోయలో చైనా సైనికులు ఇండియా సైనికులపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.  ఈ దాడుల్లో 20 మంది భారత సైనికులు మరణించారు.  1962 ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ఆయుధాలు వాడకూడదు.  అందుకే చైనా మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం కలిగిన సైనికులను బోర్డర్ కు పంపి దాడి చేయించిందనే ఆరోపణలు వచ్చాయి.  

అంతేకాదు, దాడి చేసే సమయంలో చైనా సైనికులు కర్రలు, ముళ్ల కంచెలు వినియోగించారు.  అయితే, ఇప్పుడు చైనా సైనికులకు ధీటుగా ఇండియా ఘాతక్ సైనికులను రంగంలోకి దించింది.  ఈ సైనికులు అన్ని రకాలుగా తర్ఫీదు పొందారు.  మార్షల్ ఆర్ట్స్ తో పాటు పర్వతాలు ఎక్కడం, విపత్కర పరిస్థితుల్లో శతృవులతో ఆయుధాలు లేకుండా పోరాటం చేయడం, అవసరమైతే అన్ని రకాల ఆయుధాలు ఉపయోగించి శత్రువుతో పోరాటం చేయడం వంటి వాటిల్లో ఈ సైనికులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందారు.  35 కిలోలకు పైగా బరువు భుజాన వేసుకొని 40 కిలోమీటర్ల దూరం నడవగలుగుతారు. 43 రోజులపాటు కఠినమైన శిక్షణ పొందిన ఈ సైనికులు ఇప్పుడు బోర్డర్లో విధులు నిర్వహిస్తున్నారు.