దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

మన దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్‌ డౌన్‌ పాటిస్తున్నా.. వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య వృద్ధి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  ఇప్పటి వరకూ  దేశంలో 649 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 12 మంది చనిపోయారు.  మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో పాజిటివ్‌  వచ్చిన రోగులు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణా రోగుల సంఖ్య 41కి చేరుకుంది. ఏపీలో కొత్తగా రెండు పాజిటివ్‌ కేసులు వెలుగు చూడటంతో వైరస్‌ వచ్చిన వారు పది మంది అయ్యారు. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్నా.. నిన్న హైదరాబాద్‌తోపాటు.. ఏపీ, తెలంగాణ బోర్డర్‌లో భారీగా జనం గుమిగూడటం ఆందోళన కలిగించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు  నాలుగున్నర లక్షలు దాటేసింది.  4 లక్షల 70 మంది వేల మందికి పైగా వైరస్‌ సోకింది. మృతులు 21వేలకు పైనే ఉన్నారు. కరోనా వెలుగు చూసిన  చైనాలో నమోదైన మరణాలను మొన్న ఇటలీ దాటేస్తే తాజాగా స్పెయిన్‌ సైతం చైనాను క్రాస్‌ చేసింది. చైనాలో ఇప్పటి వరకూ 3వేల 287 మంది చనిపోతే..  ఇటలీలో 7వేల 503 మంది, స్పెయిన్‌లో 3 వేల 647 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో సైతం మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది. ఇరాన్‌లో 2 వేల 77,  ఫ్రాన్స్‌లో 13వందల 31 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఇటలీలో 683 మంది, స్పెయిన్‌లో 656 మంది, ఫ్రాన్స్‌లో 231 మంది, అమెరికాలో 164 మంది చనిపోయారు.