ఇండియాలో ఐదున్నర లక్షలు దాటిన కరోనా కేసులు

ఇండియాలో ఐదున్నర లక్షలు దాటిన కరోనా కేసులు

ఇండియాలో కరోనా విజృంభిస్తోంది.  ప్రతి రోజు దాదాపుగా 20 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో 18,522 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,66,840కి చేరింది.  ఇక గడిచిన 24 గంటల్లో 418 మరణాలు సంభవించాయి.  దీంతో మొత్తం మరణాల సంఖ్య 16,893కి చేరింది.  
ఇండియాలో 2,15,125 యాక్టివ్ కేసులు ఉండగా 3,34,821 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 2,10,292  మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలియజేసింది.  దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 86,08,654 కరోనా టెస్టులు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.